ఒకప్పటి క్లాసిక్ చిత్రం. అప్పటి పాటలు ఇప్పటికి కూడా మన ప్లే లిస్ట్ లో ఉంటాయంటే అతిశయోక్తి కాదు. కొత్త నటులతో దర్శకుడు సెల్వరాఘవన్ తెరకెక్కించిన సెన్సషనల్ చిత్రం 7/జి బృందావన కాలనీ. 20 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ చిత్రం యువతని ఒక ఊపు ఊపింది. “అనిత” అనే పేరు ఏ అమ్మాయికి ఉందని తెల్సిన కూడా ఆ చిత్రానికి కనెక్ట్ అయ్యేవారు. ఇప్పుడు ఈ చిత్రం మళ్ళీ చర్చల్లోకి వచ్చింది. ఎందుకని అనుకుంటున్నారా, మరేమిలేదు. ఈ చిత్రానికి సీక్వెల్ ఇప్పుడు తెరకెక్కిస్తున్నారు చిత్ర బృందం. క్రిందటి ఏడాది ఈ చిత్రాన్ని మళ్ళీ రీ-రిలీజ్ చేసారు. ఎవరు ఊహించని రెస్పాన్స్ వచ్చింది ప్రేక్షకుల నుంచి. యువన్ శంకర్ రాజా పాటలకి థియేటర్ లో ఒక కాన్సర్ట్ అయ్యింది అంటే నమ్మాల్సిందే. రవి కృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం ఒక రేంజ్ హిట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఈ చిత్రానికి అదే సాంకేతిక నిపుణుల్ని పెట్టి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. రీ – రిలీజ్ అయినప్పుడే ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుంది హీరో ప్రెస్ మీట్ లో వెల్లడించారు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈరోజు నూతన సంవత్సరం సందర్బంగా అధికారికంగా బృందం పోస్టర్ రిలీజ్ చేసింది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో, యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. మిగిలిన విషయాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది అని తెలుస్తోంది. వేచి చూడాలి, ఒకప్పటి ఆదరణ మళ్ళీ లభిస్తుంది ఏమో.







