పండగలు ఏమన్నా వస్తున్నాయంటే చాలు, కొత్త చిత్రాలు ఏమి వస్తున్నాయా, ఇంకా షూటింగ్ జరుగుపుకుంటున్న చిత్రాల నుంచి ఏమన్నా కొత్త లుక్ లో పోస్టర్స్ వస్తాయేమో అని అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని కొన్ని చిత్రాలు స్పెషల్ పోస్టర్స్ విడుదల చేసారు. వాటి గురించి తెలుసుకుందామా మరి ?
రామ్ పోతినేని డబల్ ఇస్మార్ట్ తెచ్చిన పరాభవంనుంచి బాగానే కోలుకున్నారు అనిపిస్తుంది ఆయన కొత్త చిత్రం పోస్టర్ చూస్తుంటే. భాగ్యశ్రీ తో జతకలిసి “మహా లక్ష్మి” అనే చిత్రంతో మానని త్వరలోనే పలకరించబోతున్నారు. మహేష్ బాబు పి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పోస్టర్ లో రామ్ లుక్ అయితే చాక్లెట్ బాయ్ లాగా అదిరిపోయింది. భాగ్యశ్రీ కూడా చాలా క్యూట్ గా ఉన్నారు. ఈ చిత్రంలో రామ్ పేరు సాగర్ అని పోస్టర్ ద్వారా వెల్లడించారు చిత్ర బృందం. ఈ లవ్ స్టోరీ తో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి రామ్ రావాలని కోరుకుందాం.

గత చిత్రం “ఎక్స్ట్రార్డినరీ మాన్” అనుకున్నంత ఆదరణ రాకపోవటంతో ఈసారి చెయ్యబోయే చిత్రం మంచి పకడ్బంధీగా ప్లాన్ చేసారు హీరో నితిన్. తనకి చాలా ఫ్లోప్స్ తరువాత హిట్ ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుములతో కలిసి “రాబిన్ హుడ్” అనే చిత్రాన్ని తెస్తున్నారు. ముందుగా రష్మిక హీరోయిన్ అనుకున్నారు, అనుకోని విధంగా అందాల కిసిక్ భామ శ్రీలీల ఆ పాత్రని భర్తీ చేసారు. క్రిస్మస్ కి విడుదల అవ్వాల్సిన ఈ చిత్రం టీజర్ ఇప్పటికే విడుదల అయ్యి నెట్టింట సందడి చేస్తోంది. కాకపోతే విడుదల మాత్రం సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి కూడా ఒక లవ్లీ పిక్చర్ విడుదల చేసారు బృందం.

డాక్టర్ గానే కాదు, డైరెక్టర్ గా కూడా తన సత్తా చాటారు దర్శకుడు శైలేష్ కొలను. HIT పేరుతో ఆయన తెరకెక్కించిన రెండు చిత్రాలకి మంచి ఆదరణ లభించింది. ఈ సిరీస్ ని హీరో నాని నిర్మిస్తున్నారు. మొదటి భాగంలో విశ్వక్సేన్ నటించగా, రెండొవ భాగంలో అడవి శేష్ నటించి మెప్పించారు. ఇప్పుడు మూడోవ పార్ట్ రాబోతోంది. ఈసారి నిర్మాతనే హీరోగా దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ చిత్రానికి నాని కొంత కథని కూడా సమకూర్చారని వార్తలు కూడా వినిపించాయి. ఈ పార్ట్ లో నాని గారు ఒక క్రూరమైన పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. “అర్జున్” అనే పేరు ఇప్పటికే మన అందరికి తెలిసిన విషయమే. ఇప్పటికే హిట్ ట్రాక్ లో ఉన్న నాని కి ఇది ఇంకో హిట్ అవ్వబోతోంది అని సినీ అభిమానులు తమ అభిప్రాయం వ్యక్తపరిచారు.

ఇంకా చాలా చిత్రాలు వాటి పోస్టర్స్ ని విడుదల చేసాయి. ప్రియదర్శి చిత్రం అయన సారంగపాణి జాతకం, పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు చిత్రం నుంచి పాటకి సంబందించిన పోస్టర్, శ్రీకాంత్ ఓడెలా, నాని చిత్రం “పారడైస్” షూటింగ్ స్టార్ట్ చేస్తున్న క్లాప్ పోస్టర్ విడుదల చేసారు. ఇన్ని అద్భుతమైన చిత్రాలని మనం ఈ సంవత్సరం చూడబోతున్నాం. వేచి చూడాలి ఈ చిత్ర బృందాల నుంచి ఇంకెలాంటి పోస్టర్స్ వస్తాయో.






