- Advertisement -spot_img
HomeUncategorized‘టెనెంట్’ టైటిల్ గ్లింప్స్ విడుదల...

‘టెనెంట్’ టైటిల్ గ్లింప్స్ విడుదల…

- Advertisement -spot_img

కమెడియన్‌గా, నటుడిగా అందివచ్చిన అవకాశాలతో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపును, ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నటుడు సత్యం రాజేష్. ఇప్పుడాయన హీరోగా నటించిన ‘మా ఊరి పొలిమేర -2’ చిత్రం ఈ నవంబర్ 3న గ్రాండ్‌గా విడుదల కాబోతుండగా..

తాజాగా ఆయన నటించిన మరో చిత్రం ‘టెనెంట్’ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ ‘టెనెంట్’ చిత్రం మన చుట్టూ జరిగే సంఘటనలకి దగ్గరగా ఉండే ఒక సింపుల్ ఫ్యామిలీ ఎమోషనల్ మర్డర్ మిస్టరీ కథ. ముఖ్యంగా ఆడవాళ్లు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.

‘అద్భుతం’ చిత్రాన్ని నిర్మించిన మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా.. ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ చిత్రానికి దర్శకత్వం వహించిన వై. యుగంధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ.. స్ర్కీన్‌ప్లే, సంభాషణల్ని కూడా అందించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page