చిత్రం: గేమ్ ఆన్
విడుదల తేదీ: 02.06.2023
రేటింగ్: 3/5
బాటమ్ లైన్: “Heartfelt Thrills: ‘Game On’ Balances Romance and Mind Games for an Unforgettable Experience!”
నటి నటులు: గీతానంద్, నేహా సోలంకి, మధుబాల, ఆదిత్య మీనన్, వాసంతి, కిరిటీ, శుభలేఖ సుధాకర్ తదితరులు.
ఎడిటర్: వంశీ అట్లూరి
సంగీత దర్శకుడు: అభిషేక్ ఏఆర్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్
నిర్మాత: రవి కస్తూరి
మూవీ బ్యానర్: ఎ కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్ & గోల్డెన్ వింగ్స్ ప్రొడక్షన్స్
స్క్రిప్ట్: విజయ్ కుమార్ సిహెచ్
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: దయానంద్

‘గీతానంద్’, ‘నేహా సోలంకి’ జంటగా నటించిన చిత్రం ‘గేమ్ ఆన్’. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి ‘దయానంద్’ దర్శకత్వం వహించారు. ఎ కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్ & గోల్డెన్ వింగ్స్ ప్రొడక్షన్స్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి ‘రవి కస్తూరి’ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే, విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులని నుండి అనుహ్య స్పందన రావడంతో పాటు, మేకర్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచారు. ఫిబ్రవరి 2న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.
కథ: ‘సిద్ధార్థ్'(గీతానంద్) ఒక గేమ్ కంపెనీ లో ఇన్నోసెంట్/ఇన్ సెక్యూరిటీ తో బ్రతికే ఒక ఉద్యోగి. తను బాగా నమ్మిన రాహుల్(కిరిటీ), మోక్ష(వాసంతి) ఇద్దరి వళ్ళ ఉద్యోగం పోగుట్టుకొని నిశ్చహయ స్థితిలో రోడ్డున పడతాడు. చావే తన దారి అనుకున్న సిద్ధార్థ్(గీతానంద్) ‘గేమ్ లూప్’ ఎంట్రీ ద్వారా తన పూర్వ వైభవంకి రి-ఎంట్రీ ఇస్తాడు. అసలు గేమ్ లూప్ మోటో ఏంటి? గేమ్ లూప్ లో హీరో ఫెస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? హీరోయిన్ తారా(నేహా సోలంకి) గేమ్ లూప్ లో పాత్ర ఏంటి? సిద్ధార్థ్(గీతానంద్) తన మధర్ అర్చన(మధుబాల)ని ఎందుకు ద్వేషిస్తున్నాడు? సిద్ధార్థ్(గీతానంద్) ఇనోసెంట్ నుంచి ఫైటర్ గా ఎలా మారాడు? అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అనేది తెలుసుకోవాలి అంటే మీరు సినిమా తప్పకుండ థియేటర్ లో చుడాలిసిందే?

విశ్లేషణ: డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అలాంటి డిఫరెంట్ కథతో వస్తున్న సినిమా ‘గేమ్ ఆన్’. సైక్లాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం. హీరో తన జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి , రియల్ టైమ్ సైక్లాజికల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు? అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తుంది. ఇలాంటి, కథలకి ప్రేక్షకులు బ్రమ్మరథం పడతారు. కాకపోతే, స్టోరీ గ్రిప్పింగ్ ఉండి ట్విస్ట్ లు వర్కౌట్ చేయగలిగితే సినిమా హిట్ ఖాయం.
ఫస్ట్ హాఫ్: శుభలేఖ సుధాకర్ తో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయ్యి, సినిమా ప్రెజెంట్ లో కి వస్తుంది. హీరో సిద్ధార్థ్ తన గర్ల్ ఫ్రెండ్ మోక్ష(వాసంతి) ఘాడంగా లవ్ చేసుకుంటారు. రాహుల్(కిరిటీ), మోక్ష(వాసంతి) ఇద్దరి వళ్ళ ఉద్యోగం పోగుట్టుకున్న సన్నివేశాలు కన్విన్స్ గా ఉండవు. ఆ తరువాత చావే తన దారి అనుకున్న సిద్ధార్థ్(గీతానంద్) గేమ్ లూప్ లోకి ఎంట్రీ ఇస్తాడు. గేమ్ లో ఇచ్చిన ‘టాస్క్’లు బాగానే ప్రెజెంట్ చేసారు. కాకపోతే కొన్నిసన్నివేశాలు బోరింగ్ గా అనిపిస్తాయి. ‘రిచ్ రిచ్’ సాంగ్ బాగుంటుంది. కట్ చేస్తే, హీరో బెడ్ రూమ్ లో హీరోయిన్ తారా(నేహా సోలంకి) ఎంట్రీ, ఆ తరువాత ఇద్దరి మధ్య సాగే పలు సన్నివేశాలు బాగుంటాయి. ప్రీ-ఇంటర్వెల్ ట్విస్టులతో సాగుతూ ఇంటర్వెల్ బ్యాంగ్ ఓ మేరకు పర్వాలేదు.

సెకండ్ హాఫ్: కట్ చేస్తే, గేమ్ లూప్ నుంచి దూరంగా వెళ్ళిపొయ్యి హీరోయిన్ తారా(నేహా సోలంకి) తో ఒక ఫార్మ్ హౌస్ లో గడుపుతాడు. ఇద్దరి మధ్య సాగే రొమాంటిక్ సాంగ్ బాగుంటుంది. సినిమాలో ఫైట్ సీన్స్ చాలా బాగా తెరకెక్కించారు. తారా(నేహా సోలంకి) & సిద్ధార్థ్(గీతానంద్) ఘాడంగా ప్రేమలో మునిగి తేలతారు. ఆ ఎమోషన్ లో హీరో సిద్ధార్థ్ తన ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేయగా, తన వీక్నెస్ పట్టుకొని గేమ్ లూప్ లోకి విలన్ మల్లి ఎలా రప్పించాడు? క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి.

మొదటి భాగం కన్నా రెండొవ భాగం చాలా బాగుంటుంది. సినిమాలో కామిడి ఉంటుందేమో అని ఎక్సపెక్ట్ చేసి రావద్దు. సైక్లాజికల్ గేమ్ థ్రిల్లర్ అయ్యినప్పటికీ గేమ్ పరంగా థ్రిల్ చేసిన, ఒక మనిషిని సైక్లాజికల్ గా ఇబ్బంది పెట్టేంత బలమైన సన్నివేశాలు లేవు. ఓవరాల్ గా థియేటర్ లో తప్పకుండ చుడాలిసిన సినిమా. సో, డోంట్ మిస్ టూ వాచ్.

నటి నటులు పెర్ఫామెన్స్: హీరో గీతానంద్ తెలుగు తెరకి కొత్తవాడే అయ్యినప్పటికీ నటన పరంగా బాగానే రాణించాడు. కాకపోతే, కొన్ని సన్నివేశాలలో కాన్ఫిడెంట్ గా కనిపించలేదు. కొంచెం యాక్టింగ్ లో మెళుకువలు నేర్చుకుంటే, కమర్షియల్ హీరో గా ఎదిగే అవకాశం పుష్కలంగా ఉంది. ట్రైలర్ లో హీరోయిన్ ‘నేహా సోలంకి’ ని చూసాక కేవలం గ్లామర్ కోసమే అనుకుంటే మోసపోయినట్టే, సినిమాలో ఈ భామ యాక్టింగ్ తో అందరిని డామినేట్ చేసింది. ఈ అమ్మాయి కి డబ్బింగ్ ఎవ్వరు చెప్పారో గాని వాయిస్ వింటుంటే మత్తేక్కిద్ది. ఇక ముద్దు గుమ్మా అందాలకి ఫిదా అవ్వలిసిందే. ఆదిత్య మీనన్ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్, ఆయన యాక్టింగ్ సూపర్బ్. మధుబాల, శుభలేఖ సుధాకర్ కథ లో కీలక పాత్ర పోషిస్తునే యాక్టింగ్ లో బాగా రాణించారు. వాసంతి, కిరిటీ, తమ పరిధి మేరకు యాక్టింగ్ బాగా చేసారు.

సాంకేతిక విభాగం: డైరెక్టర్ ‘దయానంద్’ కథ ఎంచుకున్న తీరు, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా మలిచిన విధానం సూపర్బ్. కాకపోతే బలంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు పడి ఉంటే నెస్ట్ లెవెల్ ఉండేది. వంశీ అట్లూరి ‘ఎడిటింగ్’ వర్క్ శ్రద్ద తీసుకుంటూనే క్రిస్పీ గా తీర్చిదిద్దారు. ‘అభిషేక్ ఏఆర్’ అందించిన మ్యూజిక్ ఖచ్చితంగా ప్రేక్షకులు బ్రమ్మరథం పడతారు. అరవింద్ విశ్వనాథన్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ ఏ మాత్రం తీసిపోకుండా రిచ్ గా తెరకెక్కించారు.
రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్
గమనిక: మేము రాసే రివ్యూలు ఒక వ్యక్తి కి లేదా, సంస్థ కి అనుకూలంగా కానీ, ఒకరిని ఉద్దేశించి కానీ రాసింది కాదు. కేవలం, మా రివ్యూర్ అభిప్రాయం మాత్రమే. మీరు పెట్టిన ఎఫర్ట్స్ ప్రశంసనీయం. మీరు అందించిన ఈ చిత్రం థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం.






