- Advertisement -spot_img
HomeUncategorizedహ్యాపీ ఎండింగ్ మూవీ రివ్యూ: Happy Ending Movie Review

హ్యాపీ ఎండింగ్ మూవీ రివ్యూ: Happy Ending Movie Review

- Advertisement -spot_img

చిత్రం: హ్యాపీ ఎండింగ్
విడుదల తేదీ: 02.06.2023
రేటింగ్: 2.75/5
బాటమ్ లైన్: ‘శాపం’ నుంచి గట్టెక్కిన ‘హ్యాపీ ఎండింగ్’.

నటి నటులు: యశ్ పూరి, అపూర్వరావు, అజయ్ ఘోష్, విష్ణు ఓయ్, ఝాన్సీ, అనితా చౌదరి, హర్ష్ రోషన్, జియా శర్మ, వంశీ నెక్కంటి, కేఎల్కే మణి, కమల్ తూము, శ్వేత తదితరులు.
ఎడిటర్: ప్రదీప్ ఆర్ మోరం
సంగీత దర్శకుడు: రవి నిడమర్తి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: అశోక్ సీపల్లి
నిర్మాత: యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల
మూవీ బ్యానర్: హాంస్ టెక్ ఫిల్మ్స్ అండ్ సిల్లీమాంక్స్ స్టూడియోస్
స్క్రీన్ ప్లే రైటర్: నాగ సాయి
దర్శకత్వం: కౌశిక్ భీమిడి

“చెప్పాలని ఉంది”, “అలాంటి సిత్రాలు”, “శాకుంతలం” వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో ‘యష్ పూరి’. తాజాగా యష్ పూరి, అపూర్వ రావ్ జంటగా నటించిన సినిమా ‘హ్యాపీ ఎండింగ్’. హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. దీనికి కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించారు. “హ్యాపీ ఎండింగ్” సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.

కథ: సితార(అనితా చౌదరి), సత్య(కమల్ తూము) ఇద్దరు చక్కటి దంపతులకి పుట్టిన ఏకైక కుమారుడు ‘హార్ష్'(యశ్ పూరి). పెళ్లైన తరువాత కూడా ఇండిపెండెంట్ గా ‘సితార’ మేకప్ బిజినెస్ పెట్టి, సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తుంటుంది. అమ్మ దారిలోనే, హార్ష్(యశ్ పూరి) కూడా ‘మేకప్ ఆర్టిస్ట్’ గా ఎదుగుతాడు. అయ్యితే, ‘హార్ష్’ చిన్నప్పుడు ‘బాబా’ వల్ల ఒక ‘శాపాని’కి గురవ్వుతాడు? ఆ శాపం వల్ల తనని ప్రేమించిన అమ్మాయిలకి దూరం గా ఉండటమే కాకుండా, తనకి నచ్చిన అమ్మాయిలని కూడా దూరం పెడతాడు. అనుకోకుండా ఒకరోజు అవని(అపూర్వ రావ్) అమ్మాయి ప్రేమలో పడి, ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. తనకి శాపం ఉండటంతో పిల్లల్నీ కనకూడదు కాబట్టి, మరి చిన్నప్పటి నుంచి క్యారీ అయ్యిన ఆ శాపం నుండి ఎలా విముక్తి పొందాడు? అసలు బాబా ఎందుకు శాపం ఇచ్చాడు? అసలు ఆ బాబా ఎవ్వరు అతని స్టోరీ ఏంటి? అసలు శాపానికి, పిల్లల్ని కనకపోవడానికి సంబంధం ఏంటి? ఆ శాపాన్ని ఎదుర్కొనేందుకు హార్స్ ఎలాంటి ప్రయత్నాలు చేసాడు? అనేది తెలుసుకోవాలి అంటే మీరు తప్పకుండా థియేటర్ లో సినిమా చుడాలిసిందే?

విశ్లేషణ: మన పురాణాల్లోని ‘శాపాలు’ అనే కాన్సెప్ట్ తీసుకుని “హ్యాపీ ఎండింగ్” కథను తెరకెక్కించారు దర్శకుడు ‘కౌశిక్ భీమిడి’. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అలాంటి డిఫరెంట్ కథతో వస్తున్న సినిమా ‘హ్యాపీ ఎండింగ్’. డివోషనల్ టచ్ ఇస్తూనే, కామెడీకి పెద్ద పీట వేసి, స్క్రీన్ ప్లే లో మ్యాజిక్ చేస్తే, కనక ప్రేక్షకులు బ్రమ్మరథం పట్టడం ఖాయం. మరి పురణాల్లో మనం చదివిన శాపాలు ఇవాళ్టి తరం కుర్రాళ్ళకి సినిమా ఎలా ఉందొ తెలుసుకుందాం?

చైల్డ్ ఆర్టిస్ట్ ‘రోషన్’ ఇంట్రడక్షన్, హీరో యశ్ కి బాబా(అజయ్ గోష్) కి మధ్య సాగే ఫ్లాష్ బ్యాక్ & ప్రెజెంట్ లో జరిగే సన్నివేశాలు బాగుంటాయి. ఒక ఇండిపెండెంట్ ఓమెన్ ప్రత్యేకతని తెలియజేస్తూ వచ్చే సన్నివేశాలు, సగటు ఓమెన్ ని కంటతడి పెట్టిస్తాయి. చిన్న ఏజ్ లోనే శాపానికి గురైన ఒక కుర్రాడు దాన్ని నుంచి తప్పించుకొనే మార్గంలో కడుపుబ్బా ఎలా నవ్వించాడు. జియా శర్మ సినిమా లో తళుక్కున మెరుస్తుంది. యశ్ పూరి, అపూర్వరావు కాంబినేషన్ బాగున్నప్పటికీ, రొమాన్స్ & కెమిస్ట్రీ ఇంకాస్త పండి ఉంటే బాగుండేది. వీళ్లిద్దరి మధ్య సాగే డైలాగ్స్ ఓ మేరకు పర్వాలేదు. ఈ చిత్రం చూస్తున్నంత సేపు టాప్ డైరెక్టర్ ‘గౌతమ్ మీనన్’ సినిమా ఫ్లేవర్ కనిపిస్తుంది. కాకపోతే, స్క్రీన్ ప్లే అక్కడక్కడా బోర్ కొడుతుంటుంది. సినిమా మొదటి భాగం కన్నా, రెండొవ భాగం బాగుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ తో పాటు, క్లైమాక్స్ లాజికల్ గా టచ్ ఇచ్చి అందరిని ఎంటర్టైన్ చేస్తూ ముగిస్తాడు. సినిమాలో కామిడి ఉంటుందేమో అని ఎక్సపెక్ట్ చేసి రావద్దు. ఓవరాల్ గా థియేటర్ లో తప్పకుండ చుడాలిసిన సినిమా. సో, డోంట్ మిస్ టూ వాచ్.

నటి నటులు పెర్ఫామెన్స్: హీరో ‘యశ్ పూరి’ ప్రతి సినిమాకి నటన పరంగా అంచెలు అంచెలు గా తన ప్రతిభను కనబరుస్తున్నాడు. ఈ సినిమాలో ఎంతో సెట్టిల్డ్ గా రాణించాడు. ట్రైలర్ లో హీరోయిన్ ‘అపూర్వ రావ్’ ఎట్ట్రాక్టివ్ గా అనిపించినప్పటికీ, సినిమా మొత్తం ఆ మ్యాజిక్ ని కొనసాగించలేకపోయింది. ఇకపోతే, యాక్టింగ్ లో ఎక్సప్రెషన్స్ పలకకపోవడం మైనస్ అని చెప్పాలి. ‘అజయ్ ఘోష్’ ప్రధాన పాత్ర పోషించి, స్క్రీన్ స్పెస్ తక్కువ ఉన్నప్పటికీ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ‘విష్ణు ఓయ్’ యాక్టింగ్ బాగా చేసినప్పటికీ క్యారెక్టర్ పండలేదు. అసలు అతని ప్లేస్ లో కమేడియన్ ‘సత్య’ ఉండి, కామెడీకి పెద్ద పీట వేసి ఉంటే సినిమా వేరే లెవెల్ ఉండేది. ఝాన్సీ, అనితా చౌదరి, హర్ష్ రోషన్, జియా శర్మ తమ పరిధి మేరకు యాక్టింగ్ బాగానే రాణించారు.

సాంకేతిక విభాగం: డైరెక్టర్ ‘కౌశిక్ భీమిడి’ కథ ఎంచుకున్న తీరు బాగున్నప్పటికీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ విషయంలో విఫలం అయ్యారు. కథని బలమైన ఎమోషన్స్ తో పాటు, కామెడీకి 50% స్కోప్ ఉన్నా తెరకెక్కించలేకపోవడం పెద్ద మైనస్. ప్రదీప్ ఆర్ మోరం ‘ఎడిటింగ్’ పనితీరు బాగున్నా, ఇంకాస్త పదును పెట్టాలిసింది. ‘రవి నిడమర్తి’ అందించిన మ్యూజిక్ వినసొంపుగా బాగుంది. అశోక్ సీపల్లి అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు.

Happy Ending – Trailer | Yash Puri | Apoorva Rao | Kowshik Bheemidi | Jhansi | Hamstech Films (youtube.com)

రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్

గమనిక: మేము రాసే రివ్యూలు ఒక వ్యక్తి కి లేదా, సంస్థ కి అనుకూలంగా కానీ, ఒకరిని ఉద్దేశించి కానీ రాసింది కాదు. కేవలం, మా రివ్యూర్ అభిప్రాయం మాత్రమే. మీరు పెట్టిన ఎఫర్ట్స్ ప్రశంసనీయం. మీరు అందించిన ఈ చిత్రం థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page