ప్లే బ్యాక్ సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ( ముఖ్యం గా సమంత కు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ) మంచి గుర్తింపు తెచ్చుకున్నారు చిన్మయి శ్రీపాద. ముంబై కి చెందిన అమ్మాయి అయినా తెలుగులోనే మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు నటుడైన రాహుల్ రవీంద్రన్ ని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఐతే తరచూ ఏదొక వివాదాలలోనే ఉంటారు ఈవిడ. ముఖ్యంగా మహిళలకు సంబందించిన వివాదాల్లో ఎప్పుడు ఇరుక్కుంటారు. గతం లో కూడా కాస్టింగ్ కౌచ్ వివాదంలో ఇరుక్కున్న ఈవిడ. ఇప్పుడు మరొక వివాదంలో తలదూర్చారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో సీనియర్ నటైన “అన్నపూర్ణ” గారు అమ్మాయిల పై కొన్ని హాట్ కామెంట్స్ చేసారు. అమ్మాయిలు నైట్ 12గంటల తర్వాత బయట తిరగకూడదు, ఈ జనరేషన్ అమ్మాయిల వేషధారణ పై కూడా కొన్ని విమర్శలు చేసారు. దీని పై స్పందించిన సింగర్ చిన్మయి ఆవిడ వ్యాఖలను ఖండించారు. ఆవిడ మాటలు బాధ కలిగించాయి అంటూ మహిళల పై తన అభిప్రాయాన్ని చెప్పారు. ఇంతవరకు బానే ఉన్నా, తన అభిప్రాయాన్ని తెలియజేసే ప్రక్రియలో హద్దులు దాటారు. భారతదేశం లో అమ్మాయిలుగా పుట్టకూడదు. ఇండియా ఒక చెత్త దేశం, అమ్మాయిలును ఎలా గౌరవించాలో ఇండియన్స్ కి తెలియదంటూ కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖలు చేసారు. దీనిపైనే నెటిజన్స్ భగ్గుమంటున్నారు. మహిళలకు మద్దత్తు తెలిపే క్రమంలో దేశాన్ని దోషించడం కరెక్ట్ కాదంటూ చిన్మయి పై మండిపడుతున్నారు. దీని పై హైదరాబాద్ కి చెందిన ఒక యువకుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆ యువకుడి ఫిర్యాదు మేరకు చిన్మయి పై కేసు నమోదు చేసారు. చిన్మయి కి ఇలాంటి వివాదాలు కొత్తేమి కానప్పటికీ ఈసారి మాత్రం హద్దులు దాటారనే చెప్పాలి. దేశంలో మహిళల పై జరుగుతున్న అఘాయిత్యాలకి ఐతే ప్రభుత్వాలని విమర్శించాలి గాని. దేశాన్ని దూషించడం ఎంతవరకు కరెక్ట్ ఆవిడ విజ్ఞత కే వదిలేస్తున్నాము.






