తన అందచెందాలతో హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్స్ తో కూడా అటు నార్త్ తో పాటు ఇటు సౌత్ లోని ఆడియన్స్ ని ఉర్రూతలూగించిన తమన్నా, ఇప్పుడు మరోసారి ప్రేక్షకులని తన అందచెందాలతో ముంచేయడానికి రెడీ అయిపోయింది. సౌత్ లో దాదాపు అందరు స్టార్ హీరోస్ తో చేసిన తమన్నా. గత కొన్నాళ్లుగా సౌత్ లోని సినిమాలు బాగా తగ్గించేసింది. కానీ నార్త్ మాత్రం దూసుకుపోతుంది. మొదట్లో లిప్ లాక్ సీన్స్ చేయను అని చెప్పిన తమన్నా. ఇప్పుడు మాత్రం బాలీవుడ్ లో రెచ్చిపోతుంది. లిప్ లాక్స్ అంటే లిప్ లాక్స్ ఇచ్చేస్తుంది. హాట్ సీన్స్ అంటే హాట్ సీన్స్ చేసేస్తుంది. ఏది కావాలంటే అది సిగ్గు పడకుండా నిర్మొహమాటంగా చేసేస్తుంది. సౌత్ లో హీరోస్ తో మాత్రం లిమిట్స్ లో ఉన్న తమన్నా నార్త్ హీరోస్ తో రొమాన్స్ తో పిచ్చెక్కిచ్చేస్తోంది. ఇంకా లేటెస్ట్ విషయం ఏంటంటే తెలుగు లో మరోసారి హీరోయిన్ గా చేయడానికి రెడీ అయ్యింది. రెండు ఏళ్ళ క్రితం “హెబ్బాపటేల్” మెయిన్ లీడ్ రోల్ గా వచ్చిన చిత్రం “ఓదెల రైల్వే స్టేషన్” ఓటీటి లో రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రంలో కే.జి.ఫ్ ఫేమ్ “వసిష్ఠ సింహ” మేల్ లీడ్ రోల్ చేసాడు. సంపత్ నంది ఈ సినిమాకి కధ అందించగా, అశోక్ తేజ దర్శకత్వం వహించాడు. మళ్ళీ ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేశారు. తొలి పార్ట్ లో హెబ్బా పటేల్ ఫిమేల్ లీడ్ రోల్ పోషించగా, సీక్వెల్ లో మాత్రం తమన్నా ఆ బాధ్యత తీసుకుంది. తొలి పార్ట్ లో హెబ్బా పటేల్ గ్లామర్ షో తో రెచ్చిపోయింది. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ హెబ్బా పటేల్ గ్లామర్. మరి దానికి సీక్వెల్ ఓదెల-2 లో తమన్నా మరోసారి తన గ్లామర్ షో తో రెచ్చిపోవడం ఖాయం గానే కనిపిస్తుంది. ఈ సినిమా కి సంబందించిన రెగ్యులర్ షూటింగ్ కూడా ఇటీవలే స్టార్ట్ అయ్యింది.






