- Advertisement -spot_img
HomeReviewsవేట్టయన్ - ది హంటర్ review - FilmCombat

వేట్టయన్ – ది హంటర్ review – FilmCombat

- Advertisement -spot_img

చిత్రం: వేట్టయన్ – ది హంటర్
రేటింగ్: 3/5
బాటమ్ లైన్: Sensitive crime and action thriller – Superstar powerful action drama 🔥
నటి నటులు: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్, రానా, రితికా సింగ్, దుషార విజయన్, అనిరుధ్ రవిచంద్రన్, రావు రమేష్ తదితరులు
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
మ్యూజిక్ డైరెక్టర్: అనిరుధ్ రవిచంద్రన్
బ్యా గ్రౌండ్ స్కోర్: అనిరుధ్ రవిచంద్రన్
సినిమాటోగ్రఫీ: స్. ఆర్. కథిర్
ప్రొడక్షన్: లైకా ప్రొడక్షన్స్
డైలాగ్స్: రాకేందు మౌళి
రైటర్స్: టీ.జే. జ్ఞానవేల్, బి. కిరుతిక
నిర్మాతలు: సుభాస్కరన్
డైరెక్షన్: టీ.జే. జ్ఞానవేల్

వేట్టయన్ ది హంటర్ మూవీ రివ్యూ: Vettaiyan – The Hunter Movie Review #FilmCombat

రజినీ గారి చిత్రం అంటేనే ఒక స్వాగ్, ఒక స్టామినా, ఒక స్టైల్ ఉంటుంది. ఈ మధ్య వచ్చిన రజినీ గారి చిత్రాలలో జైలర్ ఒక్కటే అలరించింది. మంచి వసూళ్లు రాబట్టింది. ఆతరువాత తన కుమార్తె దర్శకత్వంలో నటించిన లాల్ సలాం చిత్రం నిరాశపరచటంతో రజినీ గారు ఈసారి పక్కాగా ప్లాన్ చేసి చేసినట్టు ఉంది “వేట్టయన్ – ది హంటర్” చిత్రం. పెద్ద తారాగణం, సెన్సిటివ్ కథాంశం, ఒక వ్యవస్థనే కాదు, ప్రపంచం మొత్తాన్ని ప్రశ్నించే అంశం, అనిరుధ్ మ్యూజిక్, రజినీ గారి స్టైల్, ఫహద్ ఫాసిల్ నటన, అమితాబ్ గారి ప్రెసెన్స్ చాలా అరిస్తాయి. ఒక పోలీస్ తలచుకుంటే సికచింతగలడు, న్యాయం చెయ్యగలడు అనే ఒక చిన్న గీతని చాలా చక్కగా చూపించారు దర్శకులు.

కథ:

అథియన్ (రజినీకాంత్) కన్యాకుమారి లో SP గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఆయన ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. అక్కడ లోకల్ రౌడీ మూకలని ఎన్కౌంటర్ చేస్తూ కేసులు సాల్వ్ చేస్తూ ఉంటారు. అనుకోకుండా ఒక రోజు గవర్నమెంట్ టీచర్ శరణ్య ( దుషార విజయన్) ద్వారా ఒక మత్తు పదార్ధాల రవాణా ముఠాని అంతం చేస్తారు. అనుకోని సందర్భంలో శరణ్య తన ప్రాణాలని కోల్పోతుంది. తనని నమ్మిన ఒక ఆడపిల్ల చనిపోవటం వలన తట్టుకోలేని అథియన్ చెన్నై కి వచ్చి ఆ కేసు సాల్వ్ చేసే ప్రయంత్నంలో ఒక సమస్యలో ఇరుక్కుంటారు. ఆ సమస్య నుంచి బయటపడి అందరికీ న్యాయం చేసే బాధ్యత తీసుకుంటారు. లాయర్, హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ సత్య దేవ్ (అమితాబ్ బచ్చన్), పాట్రిక్ (ఫహద్ ఫాసిల్), రూప (రితిక) సహాయంతో కేసు ని ముందుకి తీసుకువెళతారు. అనుకోని విధంగా శరణ్య హత్యకి ముఖ్యమైన కారణం సొసైటీ లో అందరూ బాధించబడుతున్న అంశం అని తేలుతుంది. ఆ సమస్య నుంచి అందరినీ రక్షించటానికి ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ హెడ్ నటరాజ్ (రానా) తో కలహం పెట్టుకుంటారు. అలా ఒక చిన్న కేసుగా మొదలైన సమస్య అనుకోని విధంగా పెద్దగా అవుతుంది. అథియన్ ఈ కేసు ని ఎలా సాల్వ్ చేసారు అనేది ముఖ్యాంశం.

కథనం:

మంచి యాక్షన్ సీక్వెన్స్ తో మొదలవుతుంది ఈ చిత్రం. కథ పరంగా మొత్తం చెన్నై ఇంకా పరిసర ప్రాంతాలలో చిత్రీకరించారు. రజినీకాంత్ గారిని ఫహద్ ఫాసిల్ ఎలివేషన్ తో ఇంట్రడ్యూస్ చెయ్యటం అందరికీ నచ్చుతుంది. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. రజినీ గారి ఇమేజ్ కి తగ్గట్టుగా తెరకెక్కించారు. అందరికీ ఎంతగానో నచ్చిన “మనసులాయో” పాటతో అథియన్ భార్య తార (మంజు వారియర్) కనిపిస్తారు. ఆవిడతో పాటుగా ఆ పాటకి అభిమానులు స్టెప్పులు వెయ్యటం పక్కా. ఎక్కడ కూడా ఆలస్యం చెయ్యకుండా ముఖ్యమైన కథలోకి తీసుకువెళ్లారు దర్శకులు. గంజాయి మాఫియా ని అరికట్టటంతో సమస్య మొదలవుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్ గా చెయ్యటం చూపించి ఎక్కడా కూడా టైం వేస్ట్ చెయ్యలేదు. అమితాబ్ గారి స్క్రీన్ అప్పీయరెన్సు ఆకట్టుకుంటుంది. ఒక అనుకోని ఎన్కౌంటర్ గురించి తెలిసిన నిజాల వలన ఖంగుతింటుంది మొత్తం డిపార్ట్మెంట్. అక్కడితో మొదట పార్ట్ ముగుస్తుంది.

జరిగిన సిట్యుయేషన్స్ ని మంచిగా మార్చటానికి అథియన్ కి వచ్చిన నెల గడువులో మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి అసలైన నేరస్తుడిని పట్టుకున్నప్పటికీ అది అక్కడితో ఆగడు అని తెలిసి అథియన్ ఒక వ్యూహాన్ని అల్లుతారు. ఆ క్రమంలో నటరాజ్ కి అథియన్ కి మధ్య గొడవ మొదలవుతుంది. నటరాజ్ ఎందుకు ఈ కేసు లోకి వచ్చాడు. అసలేం జరిగింది అని మిగతా పోర్షన్ అంతా చూపించారు.

నటీనటుల పెర్ఫార్మెన్స్:

అథియన్ గా రజినీకాంత్ గారు ఎప్పటిలానే తన స్టైల్, స్వాగ్ తో అబ్బురపరిచారు. మంజు వారియర్ కూడా తనదైన శైలిలో మెరిశారు. ఎప్పటికీ గుర్తిండిపోయే పాత్ర పాట్రిక్( ఫహద్ ఫాసిల్). ఆయన నటన అయితే అమోఘం. ఒక పోలీస్ గూఢాచారిగా చాలా బాగా జీవించారు పాత్రలో. రితికా గారు కూడా తనకు ఉన్న పరిధిలో చాలా బాగా నటించారు. రానా విల్లన్ పాత్రలో ఒక మెరుపు మెరిశారు. అభినయ గారికి ఇచ్చిన చిన్న పాత్రకి ఆవిడ న్యాయం చేసారు. ముఖ్యంగా కథ మొదలయ్యేది శరణ్య పాత్రతో. ఆ పాత్రలో నటించిన దుషార ఆకట్టుకున్నారు. రితిక, దుషార, ఫహద్ ఫాసిల్ ముగ్గురికి ఒక కంప్లీట్ పాత్రలు లభించాయి. సత్యదేవ్ పాత్రలో అమితాబ్ గారు కాకుండా ఇంకెవరిని ఊహించుకోలేము. ఒక హుందాతనం చూపించారు ఆ పాత్రలో.

సాంకేతిక విభాగం:

ముఖ్యంగా మెచ్చుకోవలసింది అనిరుధ్ ని. ఆయన ఇచ్చిన ఎలివేషన్ బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. పాటలోనే కాదు, స్క్రీన్ మీద కనిపించి కూడా ఆయన ఆకట్టుకున్నారు. ఎడిటర్ ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ వర్క్ చాలా బాగుంది. ఎక్కడనుంచి ఎక్కడిదాకా చూపించాలో ప్రతీ సీన్ అలా చూపించారు. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. కెమెరా పనితనం ముఖ్యంగా పోరాట సన్నివేశాలలో మెప్పిస్తాయి. ఎమోషన్ సీన్స్ బాగా రాసుకున్నారు డైరెక్టర్ జ్ఞానవేల్. రాకేందు మౌళి ఇచ్చిన తెలుగు డైలాగ్స్, మాస్ ఎలివేషన్స్ అన్నీ ఆకట్టుకుంటాయి. పోరాట సన్నివేశాలు కూడా రజినీ స్టైల్ లోనే ఉంటాయి. దర్శకులు జ్ఞానవేల్ తన స్టోరీ ప్లాట్ తో ఆకట్టుకున్నారు. దర్సకత్వం కూడా చాలా బాగా చేసారు. రెండొవ భాగంలో కొన్ని సన్నివేశాలు సాగతీసినట్టు అనిపించినప్పటికీ అనిరుధ్ మ్యూజిక్ తో అవి కనుమరుగవుతాయి. అలానే కొన్ని సీన్స్ ప్రెడిక్ట్ చేసే విధంగానే ఉన్నాయి.

రేటింగ్: 3/5

రివ్యూ బై : సాయిరాం తాడేపల్లి

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page